బొదంకి అనిల్ కుమార్ ను అభినందించిన జనసేన నాయకులు

విజయనగరం: వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ బొదంకి అనిల్ కుమార్ ను జనసేన నాయకులు మర్రాపు సురేష్ మరియు డా.రవి కుమార్ మిడతాన అభినందించారు. బోధంకి అనిల్ కుమార్ న్యూజిలాండ్ లో నవంబర్24 నుండి డిసెంబర్ 4 వరకు జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం తరుపున పవర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని 83 కేజీల పవర్ వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో గోల్డ్ మెడల్, అదేవిదంగా వివిధ పోటీల్లో నాలుగు గోల్డ్ మెడలు సాధించిన ఆయనకు జనసేన పార్టీ గజపతినగరం నాయకులు మర్రాపు సురేష్ మరియు జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, హరీష్ నాని, పైడి నాయుడు పాల్గొన్నారు.