IGNOU లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU)లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. ఇగ్నోలో ఖాళీగా ఉన్న 22 నాన్ అకడమిక్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.
IGNOUలో మొత్తం పోస్టుల సంఖ్య – 22
అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు – 21
సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టు – 01
దరఖాస్తు చివరి తేదీ – డిసెంబర్ 31
దరఖాస్తు చేసుకునేందుకు లింక్: Application form link
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది
అసిస్టెంట్ రిజస్ట్రార్ ఉద్యోగాలుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం 55 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ పూర్తి చేయడంతో పాటు జాబ్ చేసిన అనుభవం కలిగి ఉండాలి. పూర్తి వివరాలు వెబ్సైట్లో చూసుకోవాలి.