అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మాకినీడి తక్షణ సహాయం

పిఠాపురం: యు. కొత్తపల్లి మండలం, కొమ్మరిగిరి గ్రామం శివారు, చిన్న కవల దొడ్డి గ్రామస్తులు కొప్పిశెట్టి సూర్యచంద్ర ప్రకాష్ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది.. జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి శేషు కుమారి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. బాధితులకు రైస్ బాగ్ అందించి వారికి ఎల్లవేళలా జనసేన పార్టీ తోడు ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, గొపు సురేష్, దొడ్డి దుర్గ ప్రసాద్, పంతడ దుర్గ ప్రసాద్, కంద సోమరాజు, వళ్ళు వెంకటరమణ, పిల్లి అర్జున్, పెంకె సిద్దు, పితాని కాశీ విశ్వనాథ్, గెద్దా మల్లేష్, కేత దుర్గాప్రసాద్, కేతా మురళి, నరాల శివ, గుబ్బల సింహాద్రి, పంపన శ్రీను, అనుసురి అభి, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.