ఫ్రాన్స్ నుండి రానున్న రఫేల్ యుద్ధ విమానాలు

భారత సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకోన్న కారణంగా  ఫ్రాన్స్ నుంచి కొనుగోలుచేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌‌కు రానున్నాయి. రష్యా మొదట సరఫరా చేస్తామన్న సమయం కంటే ముందే రాఫేల్ యుద్ధ విమానాలు ఇవ్వాలని ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యాను కోరారు. దీంతో పాటు భారత్‌కు అవసరమైన బిలియన్‌ విలువైన అదనపు ఆయుధ సామగ్రిని కూడా కొన్ని వారాల్లో సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది.

 మే నెలకే  ఈ విమానాలు భారత్‌కు అందజేయాల్సి ఉండగా.. కరోనా వైరస్ తీవ్రతతో రెండు నెలలు వాయిదాపడింది. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం నాలుగు విమానాలు రావాల్సి ఉండగా.. ఆరు విమానాలను అందజేయాలని ఫ్రాన్స్‌ను భారత్ కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఫ్రాన్స్‌.. ఐదు విమానాలను పంపుతోంది. ఇప్పటికే 8 విమానాలు సిద్ధంచేసి, సర్టిఫికేషన్‌ దశ పూర్తిచేసింది.

సుదూర ప్రాంతాల నుంచి క్షిపణులను, శత్రు విమానాలను నాశనం చేసే సామర్థ్యం వీటి సొంతం. సామర్ధ్యం విషయంలో పాక్, చైనా రెండింటిపై భారత్‌ పైచేయి సాధించనుంది. మరోవైపు.. ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థను కూడా వీలైనంత తొందరగా భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం రష్యాపై ఒత్తిడి తెస్తోంది.