పవన్ కళ్యాణ్ పై జగన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను ఖండించిన గాజువాక జనసేన

నర్సీపట్నం: నర్సీపట్నం పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జగన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను గాజువాక నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు మరియు వీరమహిళలు ఖండించారు.. ఆదివారం నియోజకవర్గ జనసేన ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ శంకుస్థాపన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో మతిభ్రమించి, జనసేన పార్టీకి భయపడి, అసందర్భంగా, అసభ్య పదజాలంతో ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తుగ్లక్ పాలన వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను, రాష్ట్రాన్ని అప్పులమయం చేసి, తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజావ్యతిరేకతను తప్పుదోవ పట్టడానికి, అనవసరమైన ఆసందర్భ మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని, తన అనుకున్నట్టు 175 కి 175 నియోజకవర్గాలు గెలుస్తామని నమ్మకం ఉంటే వెంటనే వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రండి అని సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు వార్డు ఇన్చార్జిలు గవర సోమశేఖర్ రావు, కాద శ్రీను, ముమ్మను మురళి, పిడుగు బంగారు రాజు, వీరమహిళలు శ్రీమతి గొన్నా రమాదేవి, శ్రీమతి కరణం కళావతి, శ్రీమతి లక్ష్మీ, అల్లూరి రామారావు, పి వసంత్, కోటిని గోవిందరాజులు మరియు ఇతర జనసేన నాయకులు పాల్గొన్నారు.