జనం కోసం జనసేన 389వ రోజు

జగ్గంపేట: జనం కోసం జనసేన 389వ రోజులో భాగంగా కిర్లంపూడి మండలం ఎస్. తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 38100 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 389వ రోజు సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని జగ్గంపేట జనసేన ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పాటంశెట్టి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోశపాటి సుబ్బారావు, జగ్గంపేట నియోజకవర్గ ఐ.టి కో ఆర్డినేటర్ అరినే రాజేష్కి, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, జగ్గంపేట మండల రైతు కమిటీ అధ్యక్షులు సింగం వాసు, జగ్గంపేట మండల బీసీ సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, తామరాడ ఎంపీటీసీ గోకాడ రాజా, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి గరగ అప్పారావు(బుజ్జి), కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్, ఎస్. తిమ్మాపురం గ్రామం నుండి ఎద్దు అర్జున్, గండికోట కృష్ణ, కొండా దుర్గబాబు, జలసూత్రపు చెల్లయ్య, కంటే తాతాజీ, వాసు, శృంగరాయునిపాలెం గ్రామం నుండి పుర్రె శ్రీను, మడుగుల బాబ్జి, ఉగ్గిన శివ, గరగ పెద్దకాపు, కూనిశెట్టి ఆనంద్, సానాసి రాజ్ కుమార్, గొంతిన శ్రీను, తామరాడ నుండి గ్రామ అధ్యక్షులు సుంకర రాజు, అంకం వీరబాబు, పప్పల వీర వెంకట రమణ, పప్పల సతీష్, రామచంద్రపురం నుండి సామన శ్రీను, రంపయర్రంపాలెం గ్రామ మీడియా సెల్ కార్యదర్శి దేవలంక వెంకటపతి (బాబు), తిరుమలాయపాలెం నుండి సేనాపతి రాజు, కిర్లంపూడి నుండి నాగబోయిన శివ, ఉమ్మిడిసెట్టి నానాజీ, గోనేడ నుండి నల్లం లచ్చబాబు, నల్లంశెట్టి చిట్టిబాబు, నల్లంశెట్టి వీర మోహన్, జానకి మంగరాజు, వల్లపుసెట్టి నాని, నల్లంశెట్టి వెంకటేశ్వరులుకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఎస్. తిమ్మాపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన ఎద్దు అర్జున్ కుటుంబ సభ్యులకు, గండికోట కృష్ణ కుటుంబ సభ్యులకు, గండికోట దుర్గ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.