లట్టల పుట్టినరోజుకి హాజరైన పిఠాపురంజనసేన లీడర్స్

తుని జనసేన నాయకుడు లట్టల నాగేశ్వరావు పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఆయన ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన లీడర్స్ హాజరై వేడుకలులో భాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ.. నా పిలుపును మన్నించి పిఠాపురంనుండివచ్చిన జనసేన లీడర్స్కి ధన్యవాదాలు తెలపారు. బుర్రా సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ జనసేనపార్టీకి అలుపెరగని సేవలు అందిస్తూ తుని జనసేనకి కీలక వ్యక్తిగా ఉంటున్న నాగేశ్వరావుగారికి పుట్టినరోజు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, బుర్రా సూర్యప్రకాష్ రావు, టైల్స్ బాబి, పెడ్డిరెడ్ల భీమేశ్వరావు, పెంకె జగదీశ్, మల్లం శ్రీనువాస్, రారౌతు సూరిబాబు, పి ఎస్ ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.