ర్యాలీలు సభలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలి

రాయచోటి ఇటీవల జరిగిన రెండు మూడు సంఘటనల దృష్టిలో పెట్టుకొని సభలు ర్యాలీలపై నిషేధాన్ని విధిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని సిపిఐ జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం సమీపంలో అంబేద్కర్ బొమ్మ వద్ద జీవో కాపీలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు జనసేన జిల్లా నాయకులు రామ శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలము నాటి జీవోను తీసుకొని వివిధ పట్టణ కార్పొరేషన్ మున్సిపల్ ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలు సభలు నిర్వహించకూడదని 1861 పోలీస్ యాక్ట్ ను ఉపయోగించి, అలానే దళిత సామాజిక వర్గానికి చెందిన మహాసేన రాజేష్ మీద వైసీపీ నేతలు పాల్పడిన దాడులను తీవ్రంగా ఖన్డిస్తూ నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న సిపిఐ ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేందుకై ఇలాంటి చీకటి జీవోలు తీసుకురావడం బాధాకరమన్నారు ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. ఇప్పటికే పోలీస్ 30 యాక్ట్ ఉండడంతో ర్యాలీలకు ధర్నాలకు ప్రజా నిరసనలు తెలియజేయడానికి అరుదుగా అనుమతిస్తున్నారు ఇలాంటి తరుణంలో ప్రజల వైపున నిలబడి పోరాడుతున్న వారిని నియంత్రించడానికి ఇలాంటి చీకటి చట్టాలను ఉపయోగించడం మానుకొని ప్రజా సమస్యల సాధన కోసం దృష్టి సారించాలని అన్నారు రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించే చీకటి జీవోను తక్షణం రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ నాయకులు యాప రాల్ల పుల్లయ్య జనసేన రాయచోటి ఇంచార్జ్ అసాన్ భాష షేక్ సయ్యద్ షేక్ ఎమ్మార్పీఎస్ నాయకులు రామాంజనేయులు రియాజ్ జై భీమ్ నాయకులు చెంచర్ల ఆంజనేయులు దూదేకుల సంఘం అధ్యక్షులు మస్తాన్, జనసైనికులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.