తుఫాను ప్రభావంతో నట్టేట మునిగిన రైతులను వెంటనే ఆదుకోవాలి..

  • వర్షంతో తడిసిన ధాన్యాన్ని నాణ్యత పేరుతో రేటు తగ్గించకుండా కొనుగోలు చేయాలని జనసేన తరఫున డిమాండ్ చేసిన నెరుసు కృష్ణ ఆంజనేయులు

కృష్ణా జిల్లా: అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని నాణ్యత పేరుతో రేటు తగ్గించకుండా కొనుగోలు చేయాలని జనసేన పార్టీ తరఫున కృష్ణా జిల్లా జనసేన నాయకులు నెరుసు కృష్ణ ఆంజనేయులు డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాజిల్లా తీర ప్రాంతాలలో ఒకవైపు తుఫాను అకాల వర్షాలు కురిసి.. కోసిన పంట రోడ్డు మీద ఉందని రైతులు ఆందోళన చెందుతుంటే… ఆర్.బి.కే ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వలన యంత్రాల ద్వారా కోసిన ధాన్యం తడిసి తడి శాతం ఎక్కువ ఉన్నది. తడి శాతం పేరుతో రేటు తగ్గించకుండా రైతులకు పూర్తి ధర ఇచ్చి ఆదుకోవాలని.. కల్లాలలో వున్న ధాన్యాన్ని గోదాములలోకి చేర్చే విధంగా యంత్రాంగాన్ని సమాయత్వం చెయ్యలని… ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనంపై శ్రద్ధ పెట్టారని.. ఆ శ్రద్ద ఏదో వారి శాఖలపై వారి ప్రాంత ప్రజల కష్టాలపై పెడితే ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని వాహన రంగు, పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న చొక్కా రంగు కన్నా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి వాటిపై శ్రద్ధ పెట్టాలని.. వాహనం సంగతి రవాణా శాఖ వారు చూసుకుంటారు, ప్రజల సంగతి మీరు చూడండి.. పవన్ కళ్యాణ్ గారి పై ప్రెస్ మీట్ లు పెట్టే విశ్వాస పాత్రులు.. దశాబ్దాల పాటు వాళ్ళను మోస్తున్న ప్రజలు మరియు ఆ ప్రాంత రైతులు పడుతున్న కష్టాలపై ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో అర్థం కావట్లేదని ఇప్పటికైనా పూర్తిస్థాయి యంత్రాంగాన్ని ఉపయోగించి రైతులను ఆదుకోవాలని నెరుసు కృష్ణ ఆంజనేయులు డిమాండ్ చేసారు.