యువశక్తి పోస్టర్లను ఆవిష్కరించిన రేఖా గౌడ్

ఎమ్మిగనూరు, జనవరి 12 న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహిస్తునున్న యువశక్తి పోస్టర్లను జనసేన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖా గౌడ్, ఈ సందర్భంగా రేఖ గౌడ్, మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీలు యువతకి మోసపూరిత హామీలు ఇచ్చి వాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రరాష్ట్రంలో యువత కోసం ముందుండి పోరాడుతున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ని కావున యువతి యువకులు పార్టీకి అండగా నిలబడి యువశక్తి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని వారి యొక్క సమస్యల్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోవాలని కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రవి ప్రకాష్, రాహుల్ సాగర్, కరణం రవి, బజారి, వెంకటేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.