హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన పాదయాత్ర

రామగుండం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కార్యాచరణలో భాగంగా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ల సూచనల మేరకు జనసేన పార్టీ రామగుండం నియోజకవర్గం కో ఆర్డినేటర్ మూల హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకునే విధంగా పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా హరీష్ గౌడ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానాన్ని జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేస్తూ పార్టీ నియోజకవర్గంలో విస్తరించేలా కృషి చేస్తామన్నారు. పాదయాత్ర కార్యక్రమం నాలుగు విడతల్లో ఉంటుందని మొదటి విడత గోదావరిఖని టౌన్ లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు రావుల మధు, లింగం బాలరాజు, రావుల సాయికృష్ణ, వేమూర్ల రంజిత్, రవికాంత్, శెట్టి రాజశేఖర్, గోపి, రాకేష్, సాట్ల సతీష్, తిరుపతి, అశ్రిత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.