తెగిపడ్డ 11 కేవీ విద్యుత్‌ తీగ.. దగ్ధమైన గడ్డి వాము ట్రాక్టర్

  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వాహన కమిటీ సభ్యులు గుర్రంకొండ భానుచంద్రారెడ్డి

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం,
కార్వేటినగరం గ్రామ పంచాయతీలో శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విజయ మాంబపురం గ్రామంలో విధ్యుత్ తీగలు కిందకి జంప్ అవడంతో గడ్డి వాముతో వస్తున్న ట్రాక్టర్ కి కరెంటు తీగలు తగిలి ట్రాక్టర్ తో సహా దగ్ధమైంది. గ్రామం నడిబొడ్డున అగ్నిప్రమాదం జరగడం వల్ల గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సబ్స్టేషన్ కి సమాచారం ఇచ్చిన వెంటనే లైన్ మాన్ కరెంటుని ఆఫ్ చేయడం జరిగింది. ప్రమాదఒ జరిగిన చోట గ్రామస్తుడైన రవీంద్రారెడ్డి ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా ట్రాక్టర్ ని గ్రామం బయట వదిలి పెట్టడం జరిగింది. ప్రాణహాని ఏమి జరగలేదు. గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వాహన కమిటీ సభ్యులు గుర్రంకొండ భానుచంద్రారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున అధికారులు తక్షణమే 11 కే విద్యుత్ తీగను సరిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు.