‘నమస్తే సేట్ జీ’ ఫస్ట్ లుక్

తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి జంటగా నటిస్తున్న చిత్రానికి ‘నమస్తే సేట్‌ జీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ని హీరో సునీల్‌ విడుదల చేశారు. ప్రజలకు నిత్యావసరాలను అందించిన కిరాణా షాప్‌ వాళ్ల గురించి ఈ చిత్రం కథాంశం.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ ఈ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు అందిస్తూ, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసిన కిరాణాషాప్‌ నిర్వాహకులకు సంబంధించిన కథ ఇది. మా నాన్న కూడా ఒక కిరాణాషాపు నిర్వహించేవారు. ఒక కిరాణాషాపు వ్యాపారి కొడుకుగా నేను తీసిన ఈ చిత్రం కిరాణాషాపుల యజమానుల నిజజీవితాలకు దగ్గరిగా వుంటుంది. త్వరలోనే చిత్రీకరణ పూర్తిచేసి, విడుదల చేస్తాం’ అన్నారు.