క‌థ‌ల ఎంపిక‌లో మరిన్ని జాగ్ర‌త్త‌లు: షారూక్

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారూక్‌ఖాన్ 2018లో విడుద‌లైన ‘జీరో’ త‌ర్వాత మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. వ‌రుస ప్లాపులు చ‌విచూసిన నేప‌థ్యంలో షారూక్ క‌థ‌ల ఎంపిక‌లో మరిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని భావిస్తున్నారు. ఈ నేపద్యం లో ఆయ‌న ఎక్కువ‌ క‌థ‌ల‌ను విన్నారు. ఈ మేర‌కు దాదాపు 18 క‌థ‌లు షారూక్ గ్రీన్ సిగ్న‌ల్  కోసం ఎదురుచూస్తున్నాయి అని ప్ర‌స్తుతం బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇందులో కొన్ని సినిమాల్లో షారూక్ న‌టిస్తే.. మ‌రికొన్నింటిని ఆయ‌న నిర్మిస్తారు. రాజ్‌కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వంలో, అట్లీ డైరెక్ష‌న్‌లో షారూక్ సినిమాలు చేయాల్సి ఉంది. క‌రోనా లేకుండా ఉంటే ఏదో ఒక సినిమా ఈపాటికి ప్రారంబం అయిఉండేది.