క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయండి.. అండగా నిలుస్తాం.. పత్తి చంద్రశేఖర్ కు నాగబాబు పిలుపు

పుట్టపర్తి: క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయండి, మీకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు నాగబాబు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ కు పిలుపునిచ్చారు. ఆదివారం అనంత జిల్లా పర్యటనలో ఉన్న నాగబాబును పత్తి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల గురించి పత్తి చంద్రశేఖర్ పీఏసీ సభ్యులు నాగబాబు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల్లో వ్యక్తం అవుతున్న ప్రజా వ్యతిరేకతను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను వివరించాలన్నారు. ప్రజలు జనసేన వైపు చూస్తున్నారని.. ఈ సానుకూలతను బలోపేతానికి అనుకూలతగా మార్చుకోవాలని నాగబాబు పత్తి చంద్రశేఖర్ కు సూచించారు. పుట్టపర్తి లోనే అన్ని మండలాల్లో జనసేన పార్టీ జెండా రెపరెపలాడిచే విధంగా శక్తివంతం లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా పత్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు.