జనసేన తరఫున ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

పెనుగంచిప్రోలు: నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది ఈ రకంగా గుర్తు చేసుకుంటూ పేనుగంచిప్రోలు తూర్పు బజారు ముత్యాలమ్మ గుడి దగ్గర సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, మండల అధ్యక్షుడు తునికిపటి శివ, ఉపాధ్యక్షులు తన్నీరు గోపీనాథ్, ప్రధాన కార్యదర్శి వినయ్, చందు, కే గోపి, ఉదయ్, చిన్న, నవీన్, పవన్, జి నవీన్, తదితరులు పాల్గొన్నారు.