బొక్కా సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: ముమ్మిడివరం మండలం, దొమ్మేటివారిపాలెం గ్రామానికి చెందిన బొక్కా సత్యనారాయణ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గురువారం సత్యనారాయణ పెద్దకార్యంలో పాల్గొని, వారి చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుమారుడు నాగభూషణం మరియు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. వీరి వెంట సానబోయిన మల్లికార్జునరావు, జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సానబోయిన వీర భద్రరావు, విత్తనాల రవి, యల్లమెల్లి బాబీ పాల్గొన్నారు.