పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జయప్రదం కావాలి.. చిట్వేలి జనసేన

చిట్వేలి: అనుంపల్లి వద్ద గల ఆంజనేయ స్వామి గుడిలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో మంగళవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్బంగా చిట్వేలి మండల పరిధిలో అనుంపల్లి వద్ద గల ఆంజనేయస్వామి దేవాలయంలో మండల జనసేన నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రజా శ్రేయస్సు కోసం చేపట్టబోయే వారాహి యాత్ర విజయవంతం కావాలని, ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా పవన్ కళ్యాణ్ పై ఉండాలని, భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ ని ఉన్నతమైన స్థానం లో చూడాలని జనసైనికులు కోరుకున్నారు. ఈ కార్యక్రమం లో చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు నరసింహ, కంచర్ల సుధీర్ రెడ్డి, పగడాల శివ, తుపాకుల పెంచలయ్య, మాదాసు శివ, షేక్ రియాజ్, మస్తాన్, అనందల తేజ, పసల శివ, కడుమూరి సుబ్రమణ్యం, పసల దినేష్, పగడాల శివ రామ్, మాదినేని హరి, వినయ్, ఆనందల లోకేష్, బెదురురి పెంచలయ్య, సుంకర శ్రీనివాసులు, వడ్డి నాని, తదితరులు పాల్గొన్నారు.