దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఆత్మకూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సోమవారం సంగం మండలంలోని బంగ్లా సెంటర్లో (తాసిల్దార్ ఆఫీస్ ఎదురుగా) క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా భాను కిరణ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు, జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను, వీరమహిళలను, జనసైనికులను దృష్టిలో పెట్టుకొని క్రియాశీలక సభ్యత్వం అనేది ప్రవేశ పెట్టడం జరిగినది. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద వశాత్తూ మరణించిన వారికి జీవిత బీమా 5,00,000/-, ప్రమాద వశాత్తూ గాయపడిన వారికి చికిత్స నిమిత్తం యాక్సిడెంట్ బీమా 50,000/-, అందచేయడం జరుగుతుంది. ఇంతవరకూ ఏ పార్టీ చేయని విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు, కార్యకర్తల, వీరమహిళలు, జనసైనికులుకు అండగా నిలవాలని ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని పెట్టడం జరిగినది. ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని సంగం మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో తప్పనిసరిగా తీసుకునే విధంగా కృషి చేస్తామని భాను కిరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంగం మండల కార్యదర్శి హజరత్, సంగం మండల కార్యదర్శి గురువరాజు, సంగం మండల నాయకులు కృష్ణమోహన్, వెంకటేష్, రంతుల్లా, శ్రీను, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.