కొత్తజంటకు శుభాకాంక్షలు.. వరుణ్ తేజ్

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ అంగరంగవైభవంగా మూడు రోజులపాటు ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా ఈ వేడుక నిర్వహించారు.

తమ గారాలపట్టి మరో ఇంటికి కోడలిగా వెళ్తున్న సందర్భంగా నిహారిక తండ్రి నాగబాబు, పెదనాన్న చిరంజీవి భావోద్వేగభరితమైన ట్వీట్లు చేశారు. తాజాగా అన్నయ్య వరుణ్ తేజ్, కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు.

‘విషింగ్ మై బంగారుతల్లి నిహారిక అండ్ మై డాషింగ్ బావ చైతన్య హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను.. అంటూ సినీ హీరో వరుణ్‌ తేజ్‌ కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపాడు. అదే విధంగా తన ముద్దుల చెల్లి నిహారిక పెళ్లి సందర్భంగా శుభాశీసులు అందజేసిన వారందరికీ ధన్యవాదాలు అంటూ.. వధువరులిద్దరినీ అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తున్న ఫొటో షేర్ చేశాడు వరుణ్ తేజ్.