వర్మపై ఫైర్

మాధవీలత సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటూ పార్టీ కార్యకలాపాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ, పవర్ స్టార్ సినిమా, పవన్ కళ్యాణ్ గొప్పదనంపై మాధవీలత చేసిన పోస్ట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.

‘పీకే ఫై పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు..? తొక్కలో సినిమా కథలు రాసుకోవడం ఎందుకు?  కాదేదీ కవితకనర్హం అన్నట్టు మొన్న ఒక ఆడపిల్ల కథ మీద సినిమా అనుకున్నాడు.. ఇప్పుడు ఏం పాపం చేశాడని పవన్ కళ్యాణ్ మీద పనికిమాలిన సినిమా… వర్మ ఏంటి నీకీ కర్మ?’ అంటూ వర్మపై ఫైర్ అయిన మాధవీలత..

ప్రజల మంచి కోరుకునే మంచి మనిషి పై నీకు పర్సనల్ పగ ఉంటే అతనితో తేల్చుకో.. చేతకాని కహాని ఎందుకు అయినా ఆయన్నీ ఏమీ పీకలేని వాళ్లు అయన పర్సనల్ క్యారెక్టర్ మీద పడి ఏడుస్తారు.. ఎప్పటికీ పీకే లవర్‌నే.. ‘అంటూ ఓ రేంజ్‌లో విరుచుకపడింది మాధవీలత.