సూపర్ స్టార్ సందేశం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రపంచ సహజ వనరుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని  పర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త గురించి ట్విట్ట‌ర్ వేదికగా ఓ విలువైన సందేశం పోస్ట్ చేశారు.

నీటిని కాపాడుదాం.. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామని పిలుపునిచ్చారు. వ్యర్థాలను ఉపయోగిద్దాం, పునరుత్పాదక శక్తిని వాడుకుందాం. ఈ సంక్షోభ సమయంలో మనం మనల్ని మనం రక్షించుకుంటూనే, ప్రకృతిని కూడా పరిరక్షించడం గుర్తుంచుకోవాలని చెప్పారు. మార్పు మన ఇంటి నుండే మొదలు కావాలి అని మహేష్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.