పశుపతినాథ్ ఆలయంలో విశిష్ట పూజలు

ఏపీలోని ఉత్తరాంధ్రలోని విజయనగరంలో ప్రతిష్టించబడిన పశుపతి నాథ్ దేవాలయంలో ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా విశిష్ట పూజలు జరిగాయి. ఆఖరి సొమవారం సందర్భంగా.. దేవాలయంలో 20 మంది దంపతులచే ఆలయ మండపంలో రుద్రాభిషేకం జరిగింది. ఈ సందర్బంగా తిరువీధులలో పశుపతి నాథ్ పల్లకిలో విహరించారు. ఈ కార్యక్రమం మొత్తం శారదా సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. ఎక్కడో కేదారినాథ్ లో కొలువైన మంచు శివలింగం స్వయంగా తెలుగు రాష్ట్రాలలో ఒక్కటైన విజయనగరం ఎస్వీఎన్ నగర్ లో ప్రతిష్టించబడి భక్తుల కొంగు బంగారమై కొలువు తీరి.. ఈ కార్తీక మాసంలో ప్రతీ రోజుతో పాటు అయిదు సోమవారాలలో మంచులింగం ఆకారంలో ఉన్నశివుడు విశేష పూజలందుకున్నాడు.