ప్రజా సంక్షేమంపై వైసిపికి ధ్యాస లేదు.. ముత్తా శశిథర్

కాకినాడ సిటిలో జనసేన పార్టీ మా ప్రాంతం – మా సచివాలయం- మన జనసేన అనే నినాదంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా, ముత్తా శశిథర్ నాయకత్వంలో బుధవారం సాయంత్రం 10ఏవ వార్డు సచివాలయం పరిధిలో మోసా ఏసేబు నిర్వాహణలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలోని ప్రజలు మాట్లాడుతూ తాము చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, తమకు ప్రభుత్వ సంక్షేమ పధకాలలో తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పించనులు కూడా అసంబద్ధమైన కారణాలు చూపి నిలుపుదల చేసారని వాపోయారు. భారీ వానలు, తుఫానులు వచ్చినపుడు ఈ ప్రాంతంలో చాలా దారుణమైన పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. దీనిపై ముత్తా శశిధర్ స్పందిస్తూ ఈ వై.సి.పి ప్రభుత్వానికి మానవీయత లేదనీ, కుటిల రాజకీయాల మీద ఉన్న ధ్యాస ప్రజా సంక్షేమం మీద లేదని విమర్శించారు. చేపల వేట నిషేధం విధించినపుడు ప్రభుత్వం ఇచ్చే భృతిని సైతం మంజూరు చేయడంలో మీనమేషాలు లెక్కపెడుతోందని, ఇదేనా పేద ప్రజమీద ఉన్న మీ ఆలోచనా ధోరణి అని ప్రశ్నించారు. ఎక్కడవేసిన గొంగళీ అక్కడే ఉన్న చందాన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కనపడుతోందనీ, లేకపోతే స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి పనులు ఈ ప్రాంతంలో ఎన్నో చేయచ్చన్నారు. మీ ప్రాంత సమస్యలను తెలుసుకొనడానికే వచ్చామని ప్రజల కోసం పోరాడటంలో జనసేన రాజీ పడదని మీకు అండగా పార్టీ ఉందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యడర్శి వాశిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ, సిటి ఆర్గనైజింగ్ శెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, దొర, నూకరాజు, కోటేశ్వరరావ్, మధు, ప్రకాష్, దైదాసు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.