కొర్రపాడు గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ను సందర్శించిన గాదె వెంకటేశ్వరరావు

తాడికొండ నియోజకవర్గం, మేడికొండూరు మండలం, కొర్రపాడు గ్రామం లో జిల్లా పరిషత్ హై స్కూల్ ను గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంలో గాదె మాట్లాడుతూ: ఈ తరగతి గదులు నాడు౼ నేడు పనులు అని గొప్పలు చెప్తున్నా ఈ ముఖ్యమంత్రి గత ఐదు నెలల నుండి తరగతి గదుల్లో విద్యార్థులు బండలు తీసేసిన నేల పై, దుమ్ము లేస్తున్న ఈ దుమ్ములో విద్యార్థులకు వారి అరికాళ్ళ నుండి మోకాళ్ళ వరకు దుమ్ముతో కూర్చో బెట్టడం జరుగుతుంది. మరోపక్క ఎక్కడ పనులు అక్కడ పెట్టి ఈ తరగతి గదుల్లో పెచ్చులు ఊడి పడే విధంగా ఉన్న ఈ ఇనుప సువ్వాలు కూడా బయటికి వచ్చి విద్యార్థుల ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ పనికిరాని సీఎం నాడు- నేడు అను కార్యక్రమంతో కోట్లు దోచుకోవడం తప్ప పనులు శూన్యం అని ఈ కొర్రపాడు స్కూలుని చూస్తే అర్థమవుతుంది గాదె విమర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు నారదాసు ప్రసాద్, తడవర్తి కేశవ, బంధనాదం జ్యోతి, సిరిగిరి శ్రీనివాస రావు, సత్తనపల్లి టౌన్ అధ్యక్షులు రాడ్లు శ్రీనివాసరావు, కందులు సైదయ్య, మేడికొండూరు మండలఅధ్యక్షులు రాచర్ల నాగబాబు, మండల నాయకులు, విజయ్, గొడవర్తి నాయక్, కుమారు, మల్లెల అనిత, బాలకృష్ణ, బర్కత్ అలీ, కొర్రపాడు గ్రామ నాయకులు చింత పెద్ద భద్రయ్య, పోతంశెట్టి శ్రీనివాసరావు, మాసబతుని ఆదినారాయణ, చింతా వెంకటేశ్వరరావు, మాస బతుని శ్రీనివాసరావు, పోతంశెట్టి లక్ష్మీనారాయణ, ఎడ్లపల్లి సీతారామయ్య, జనసేన పార్టీ కార్య కర్తలు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.