అశ్రునయనాలతో ఘన నివాళులు

  • పట్టిసీమ వద్ద మృతి చెందిన దోసకాయలపల్లి గ్రామ మృతుల కుటుంబాలకు “బత్తుల” దంపతుల పరామర్శ..
  • మృతుల కుటుంబాలకు ₹30,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేత.
  • మనోధైర్యం కోల్పోవద్దు మీ కష్టం తీర్చలేనిది, మీకు అన్ని విధాల అండగా, బాసటగా ఉంటామని మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పిన “బత్తుల” దంపతులు

రాజానగరం, మహాశివరాత్రి పర్వదినాన కోరుకొండ మండలం, దోసకాయల పల్లి గ్రామానికి చెందిన యువకులు ఓలేటి అరవింద్ (20), ఎస్ కె లుక్మన్ (19), పెద్దిరెడ్డి రాంప్రసాద్ (18) గోదావరి నదిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందిన సంగతి విదితమే. గత వారం రోజులుగా వేరే పనుల మీద ఇతర ప్రాంతానికి వెళ్లిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు బుధవారం నియోజకవర్గంలో దోసకాయలపల్లి గ్రామానికి వెళ్లి, మృతుల ఇంటికి వారి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం చెప్పి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి కన్నవారిని శోకసముద్రంలో ముంచి కన్నీరు మున్నీరవుతున్న స్వర్గస్తులైన యువకుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మనోనిబ్బరంతో ముందుకు సాగాలని చెబుతూ, ప్రస్తుత కుటుంబ ఖర్చుల నిమిత్తం కుటుంబానికి ఒక్కొక్కరికి ₹10,000/- చొప్పున మొత్తంగా మూడు కుటుంబాలకు ₹30,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి రాబోవు రోజుల్లో జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండమని భరోసా కల్పించారు, వీరివెంట నియోజకవర్గం సీనియర్ నేతలు, జనసైనికులు దోసకాయలపల్లి గ్రామపెద్దలు, జనసేనశ్రేణులు పాల్గొన్నారు.