డి.ఎల్.పి.ఓను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

  • అవినీతి కి కేరాఫ్ సింగరాయకొండ గ్రామపంచాయతీ
  • సింగరాయకొండ గ్రామపంచాయతీ రికార్డ్స్ మాయం

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ గ్రామపంచాయతీకి వచ్చిన డి.ఎల్.పి.ఓ ను జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మరియు మండల జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా శుక్రవారం కలవడం జరిగినది. అనంతరం సింగరాయకొండ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగింది. ప్రజా సమస్యలపై గతంలో జనసేన పార్టీ సుమారు 6 నెలల క్రితం అర్జీ రూపంలో ఇచ్చినప్పటికీ కూడా సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి శరత్ బాబు పరిష్కరించలేదు . సింగరాయకొండ గ్రామపంచాయితీ నందు కనుమలకు పోవు రోడ్డు నందు మురికినీటి సమస్య, వీధిలైట్లు సమస్య, కందుకూరు నుండి ఎం.ఆర్.ఓ ఆఫీస్ మీదుగా గురుకుల పాఠశాల వరకు వీధిలైట్లు వెయ్యమని, కందుకూరు రోడ్డు 5వ లైన్ లో విది లైట్లు సమస్య, మరియు మురికి నీటి డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డి.ఎల్.పి.ఓ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగినది. అదేవిధంగా సింగరాయకొండ గ్రామపంచాయతీలో తీర్మానం లు లేకుండా జరుగుతున్నటు వంటి అవినీతిని డి.ఎల్.పి.ఓ కు వివరించడం జరిగినది. అంతరం సింగరాయకొండ గ్రామపంచాయతీలో కనీసం రికార్డులు కూడా లేవని పై అధికారులకు తెలియపరిచి దీనిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని డి.ఎల్.పి.ఓ జనసేన పార్టీ మండల అధ్యక్షులు రాజేష్ కు హామీ ఇవ్వడం జరిగినది. సింగరాయకొండ గ్రామపంచాయతీలో జరుగుతున్నటువంటి అవినీతీ అక్రమాలకు బాధ్యులైన సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయవలెనని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేశారు.