మాన్వత్వం చాటిన పలాస జనసేన

పలాస, ఉద్దానంలో కిడ్నీ మహమ్మారి విలయతాండవం చేస్తుంది! బైపల్లి గ్రామానికి చెందిన దుమ్ము పూజ అనే పదిహేడు సంవత్సరాల యువతి కిడ్నీ వ్యాధికి గురై తనువుచాలించింది. తండ్రి దుమ్ము పాపారావు కూడా అదే వ్యాధితో కొద్ది రోజుల క్రితం కాలం చేసారు. దీంతో భర్త, కుమార్తె వియోగంతో ఆ ఇల్లాలు దుమ్ము రోహిణమ్మ అనాధగా మిగిలింది. దైవం ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పలాస నియోజకవర్గం నాయకులు సంతోష్ పండా గారు దుమ్ము. రోహినమ్మ గార్కి ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ వారికి తమవంతు సాయంగా 5000₹, 2 రైస్ బ్యాగులు తక్షణ సాయం చేస్తానన్నారు. ప్రభుత్వం నాయకులు ఇకనైన ఇలాంటి కష్టం ఎవరికి రాకుండా, నివారణ, నిర్మూలన చేయాలని విన్నవించారు. ఈ పరామర్శించిన వారిలో స్ధానిక అక్కుపల్లి, బైపల్లి జనసైనికులతో పాటు కిల్లి బాలకృష్ణ, మేడిశెట్టి నరసింహామూర్తి, పైల చిట్టిబాబు, బంగారు కేదార్నాధ్, వినయ్ పాల్గొన్నారు.