“మా ప్రాంతం – మన సచివాలయం” కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్

కాకినాడ సిటీ, ఎస్సీలకు పూర్వపు పథకాలు రద్దు చేసి వారి జీవన ప్రమాణాలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక జగన్నాధపురం కుంతీదేవి పేటలో మా ప్రాంతం మన సచివాలయం కార్యక్రమంలో ఆయన పాల్గొని అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదరణ లభించక ఉపాధి మార్గాలు లేక నేటికీ ఈ ప్రాంతంలో పీచు పని రెక్కలు కష్టంతో రోజుకి 150 రూపాయలు సంపాదించి కుటుంబాలు జీవిస్తున్నాయి అంటే వారి జీవితాలు ఎంత దుర్బర పరిస్ధితులలో సాగుతున్నాయో పాలకులు గుర్తెరగాలని ఈ సందర్భంగా శశిధర్ అన్నారు. నిత్యావసర ధరల ఆకాశానికి అంటిన సమయంలో కేవలం 150 రూపాయల ఆదాయం ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మర్రి సుజాత, కాకర లక్ష్మి, పిట్ల సత్యవతి, నరాల మంగ, లక్ష్మి, ఎద్దు బాల కృష్ణ, తమ్మి రమణ, కలవల గంగరాజు, తమ్మీ పెద్ద, తదితరులున్నారు.