శ్రీమతి పార్వతీ నాయుడుకు అభినందన సత్కారం

జనసేన మహిళా వింగ్ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి పార్వతీ నాయుడు పదవీకాలం సంవత్సరం పూర్తయిన సందర్భంగా మహిళలందరూ పార్వతీ నాయుడును ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. తదనంతరం గుంటూరు తూర్పు నియోజకవర్గం రెండో డివిజన్లో గడపగడపకి వెళ్లి సభ్యత్వ నమోదు గురించి వివరించి, ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవలసినదిగా శ్రీమతి పార్వతి నాయుడు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో సంకటి హరి సుందరి, లక్ష్మీ, మేకల సామ్రాజ్యం, మల్లికార్జున రావు, నాగేశ్వరరావు, రమణ మహాలక్ష్మి, పుష్ప, జీవని, పద్మ, జనసైనికులు, వీరమహిళలు అందరు పాల్గొనడం జరిగినది.