జనసేన పోరాట ఫలితం దయనేడుకు ఆర్టీసీ బస్సు

శ్రీకాళహస్తి, జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా దయనేడు గ్రామంలో ఇంటింటికీ పర్యటించినప్పుడు ఆ గ్రామంలోని ప్రజలు ప్రధాన సమస్య వారి గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేక రైతులు, విద్యార్థులు, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళినా సమస్య పరిష్కరించలేదని తెలపడంతో, సమస్యను ఆర్టీసీ అధికారులకు తెలుపగా వారి గ్రామానికి రోడ్డు గుంతలమయం అయినందున బస్సు పంపడం లేదని తెలిపారు. వినుత కోటా జిల్లా కలెక్టర్ కి, మండల అధికారులకు రోడ్డు సమస్య తెలిపినా ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ సొంత నిధులతో రోడ్డు మరమత్తులు చేయించి, ఆర్టీసీ అధికారులకు పలు మార్లు సంప్రదించి ఒత్తిడి తేవడంతో ఆఖరికి నిన్న నుండి ఆ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వినుత తెలిపారు. ఆ గ్రామంలో వారికి మాట ఇచ్చినట్టు బస్సు తెప్పించి ఆ గ్రామంలో బస్సులోనే వస్తా అని మాట ఇచ్చిన మేరకు శుక్రవారం ఉదయం 8 గంటలకు దయనేడు గ్రామానికి ఆర్టీసీ బస్సులో వెళ్లారు. ఓడిపోయినా ఇచ్చిన మాట కోసం పోరాడి బస్సు సౌకర్యాన్ని కల్పించిన జనసేన పార్టీకి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు రవి కుమార్ రెడ్డి , జనసైనికులు కాటేష్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.