కరోనా టీకా తీసుకున్న అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్..

అమెరికా కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ సోమవారం డెలవర్ లోని క్రిస్టియానా ఆస్పత్రిలో  ఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్నారు. బైడెన్ వ్యాక్సినేషన్ ను అమెరికా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ప్రజల్లో లేనిపోని అపోహాలు పోగొట్టేందుకు ఈ టీకా వేయించుకున్నానని అన్నారు. టీకా గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలు టీకా వేయించుకునేందుకు సిద్ధంగా ఉండాలి. నేను టీకా రెండో డోసు తీసుకునేందుకు ఎదురు చూస్తున్నాను.. అని అన్నారు. అయితే టీకా తీసుకుంటున్న సమయంలో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ఆయన పక్కనే ఉన్నారు. ఆమె ముందు రోజు టీకా తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ల సమర్ధత సన్నగిల్లుతోంది. వ్యాక్సిన్ తీసుకోవడం అనేది సురక్షిమని తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని బైడెన్ పేర్కొన్నారు.

కాగా, ఫైజర్ వ్యాక్సిన్ను అమెరికా, ఔషధ నియంత్రణ అనుమతి లభించిన నేపథ్యంలో టీకా కార్యక్రమం ప్రారంభమైంది. గత వారం నుంచే అమెరికా పెద్ద ఎత్తున కోవిడ్ టీకాను ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో సుమారు మూడు లక్షల 20 వేల మంది మృతి చెందారు. కాగా, అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు పలు వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి.