జనసేన సభ సక్సెస్ తో తాడేపల్లి ప్యాలెస్ కు వెన్నులో వణుకు మొదలైంది: తాతంశెట్టి నాగేంద్ర

రైల్వేకోడూరు: జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం అత్యంత దిగ్విజయం జరిగిన సందర్భంగా శుక్రవారం ఉమ్మడి కడపజిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరియు జిల్లా, నియోజక వర్గ నాయకులు కేకు కట్ చేసి అనంతరం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ గారికి స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియపరుస్తూ జనసేనపార్టీని గ్రామ గ్రామాన విస్తరించే కార్యక్రమం త్వరలో అత్యంత వైభవంగా ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కారుమంచి సంయుక్త పగడాల వెంకటేష్, గంధంశెట్టి దినకర్ బాబు, ముద్దపోలు రామసుబ్బయ్య, కనుపర్తి శంకరయ్య, నగిరిపాటి మహేష్, మాదాసు నరసింహ, వరికూటి నాగరాజ, పగడాల చంద్రశేఖర్, దాసరి వీరేంద్ర, శ్రీకారంప్రకాష్, కొండేటి మనోజ్ కుమార్,ఉత్తరాది శివకుమార్, తుపాకుల పెంచలయ్య, నీలంనాగేష్, సాదు సుబ్రమణ్యం, హరి తదితరులు పాల్గొన్నారు.