చిందేపల్లి గ్రామస్థులతో కలిసి ఆర్.డి.ఓకి జనసేన వినతి

శ్రీకాళహస్తి నియోజకవర్గం, చిందేపల్లి గ్రామానికి వెళ్తున్న ప్రధాన రహదారిపై లాంకో/ఈసీఎల్ ఫ్యాక్టరీ వాళ్ళు అడ్డుగా గోడ కట్టడాన్ని నిరసిస్తూ రోడ్డుపై అక్రమంగా అడ్డు గోడ కట్టడాన్ని వెంటనే తొలగించాలని గ్రామస్థులతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిఓ 22/2016 ద్వారా ఆర్ అండ్ బి పరిధిలోకి తీసుకున్న రోడ్డును ఏ విధంగా మూసి వేస్తారని ప్రశ్నించారు. కాలువ పరుంబోకులో ప్రత్యామ్నాయ రోడ్డు కల్పించమని జి2/1295/2022 ద్వారా కలెక్టర్ ఏవిధంగా ఉత్తర్వులు ఇస్తారని ప్రశ్నించారు. ప్రజలకి ఇబ్బంది కల్గించి ఫ్యాక్టరీ యాజమాన్యం వందల మంది పోలీసులను ఉపయోగించి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తక్షణమే రోడ్డుపై ఉన్న అడ్డు గోడను తొలగించాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని, చట్టపరంగా హైకోర్టును ఆశ్రయించి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డుకి అడ్డుగా గోడ కట్టమని ఎలాంటి ఉత్తర్వులు రెవెన్యూ అధికారుల నుండి ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఇవ్వలేదని ఆర్.డి.ఓ. తెలిపారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి రోడ్డు పై అక్రమ గోడను తొలగిస్తామని హామీ ఇచ్చారు.