వారం పాటు దేశవ్యాప్త లాక్ డౌన్

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఇంకా వదలనే లేదు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ కొత్త వైరస్ కలవర పెడుతోంది. యూకేలో కొత్త తరహా కరోనా వైరస్‌ ఇప్పుడు ఇతర దేశాలకు కూడా పాకుతోంది… మరోవైపు.. కరోనావైరస్ విస్తరిస్తుండడంతో.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తూ భూటాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి వారం రోజుల పాటు ఈ లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. రాజధాని థింఫూతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో… కోవిడ్ వ్యాప్తి పెరగడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా అన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయనీ.. స్కూళ్లు, సంస్థలు, ఆఫీసులు, వ్యాపార సంస్థలు మూసివేస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. కాగా, కరోనా వైరస్‌ విజృంభనతో గతంలోనూ ఈ తరహా లాక్‌డౌన్‌ను విధించింది భూటాన్ ప్రభుత్వం.. కేసులు మళ్లీ వైరస్ వ్యాప్తి పెరగడంతో.. మరోసారి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది.