పలు కార్యక్రమాలలో పాల్గొన్న పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మడివరం పల్లిపాలెం సెంటర్లో విత్తనాల అర్జున్ కిరాణా షాప్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. అనంతరం ఐ పోలవరం మండలం సలాది వారి పాలెం గ్రామంలో శ్రీ వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు కాకినాడ ఏ కాన్స్టెన్సీ ఫంక్షన్ హాల్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుద్దట జమ్మి కుమారుడు నిశ్చితార్థం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట పితాని రాజు, కడలి వెంకటేశ్వరరావు, సలాది రాజా, పెన్నాడ శివ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.