శ్రీవారి సన్నిధిలో బస్సు మాయమవడం హాస్యాస్పదం

  • ఇంత వ్యవస్థ ఉన్నా బస్సు మాయమవడం హాస్యాస్పదం
  • సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి
  • రేపు స్వామి వారి సన్నిధిలో విలువైన వస్తువులను దోగిలించినా, ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా! జనసేన, టిడిపి నేతలు

తిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి రథం బస్సును ఎత్తుకుపోయిన సంఘటలో టీటీడీ పాలకమండలి వారే తిరుమల శ్రీవారి సన్నిధిలో విలువైన వస్తువులను దొంగిలించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని జనసేన, తెలుగుదేశం పార్టీల నేతలు కిరణ్ రాయల్, నరసింహ యాదవ్ లు ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం మీడియా ముందు ఇరు పార్టీల నేతలు ఆర్ సి మునికృష్ణ, చినబాబు, మనోహరాచారి, రాజారెడ్డి, సుమన్ బాబు, రమేష్ నాయుడు తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ, గతంలో గరుడసేవ అంటే ప్రపంచవ్యాప్తంగా తిలకించే వారని ఆ ఘడియల్లో కోట్లాది భక్తులు సోషల్ మీడియా, టీవీ చానల్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకునే వారని గత శ్రీవారి వైభవాన్ని కొనియాడారు. వైసిపి పాలనలో బ్రహ్మోత్సవాలకు ప్రాముఖ్యత తగ్గిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో బయటకు రానివి ఎన్నో ఉన్నాయని ఆరోపించారు. తమ పార్టీల లోకి 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రానున్నారని తెలిపారు, తమ చంద్రబాబు మచ్చలేని చంద్రుడిగా బయట రావడానికి న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. పది సంవత్సరాలుగా బెయిలు మీదే సీఎం గా జగన్ కొనసాగుతున్నారని గుర్తు చేశారు. అక్టోబర్ మొదటి వారంలో వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ మన జిల్లాలలో పర్యటిస్తారని తెలియజేశారు.