శెంబువానిపాలెం యూత్ కు వాలీబాల్ కిట్

మాడుగుల, దేవరపల్లి మండలంలో రైవాడ పంచాయతీ శివారు గ్రామం అయిన శెంబువానిపాలెం గ్రామంలో ఉన్న యువతకు సోమవారం మాడుగుల నియోజకవర్గ నాయకులు రాయపురెడ్డి కృష్ణ ఆర్థిక సాయంతో మరియు ముచ్చు దుర్గారావు చేతుల మీదుగా ఒక వాలీబాల్ కిట్ ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరపల్లి మండలంలో ఉన్న యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రతీ పంచాయతీలో మరియు ప్రతీ గ్రామంలో తీసుకువెళ్లేలా జనసేన పార్టీని బలోపేతం చేసేలా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె.కోటపాడు మండల జనసేన నాయకులు కుంచా అంజిబాబు, చుక్కా నారాయణమూర్తి మరియు దేవరపల్లి మండల జనసైనికులు పాల్గొన్నారు.