అకాల వర్షాల వలన నష్టపోయిన అన్నదాతలకు నష్ట పరిహారం ఎక్కడ..?: గునుకుల కిషోర్

సర్వేపల్లి, బిడ్డల బంగారు భవిత కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ ఓటు వేసి నిస్వార్ధ నాయకుడైన పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అంటూ సర్వేపల్లి నియోజకవర్గం బండపాలెంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విదేశాలలో జలం ఉంటే సంపద ఉన్నట్లు భావిస్తారు. సముద్రపు ఒడ్డున ఉన్న ప్రాంతాలన్నీ వాణిజ్య సంపదతో నిండి ఉంటాయని అర్థం, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే సంపదతో నిండాయి. మిగిలిన వారందరూ పేదరికం అనుభవిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో కానీ, ఆర్ బి కే కేంద్రాలలో తగిన ఎరువుల సరఫరా చేయలేక పోయారు. వ్యవసాయం చేసే వారిలో ఎక్కువ ఉన్న కౌలు రైతులు అకాల వర్షాల వల్ల చేతికి వచ్చిన పంట నష్టపోయి అప్పులతో మునిగి పోయి ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. దళారుల బారిన పడకుండా రైతులకు గిడ్డంగులు కల్పించటంలో విఫలమయ్యారు. అకాల వర్షాల వలన నష్టపోయిన అన్నదాత లకు నష్ట పరిహారం ఎప్పుడొస్తుందో, తడిసిన ధాన్యం ఎప్పుడు కొంటారు తెలియక రైతులు సతమతమవుతున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సొంత సంపాదన నుంచి దాదాపు 30 కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల ఇచ్చి పవన్ కళ్యాణ్ భరోసాగా నిలిచారు. స్థానిక సమస్య ఏదైనా కానీ జనసేన పార్టీ తరఫున జనసైనికులు పోరాటం జరిపేందుకు సిద్ధంగా ఉంటారని. సార్వత్రిక ఎన్నికల్లో నిస్వార్ధ నాయకుడు పవన్ కళ్యాణ్ కి గెలిపించేందుకు గాజు గ్లాసుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాల్సిందిగా మనవి చేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్ తో పాటు స్థానిక నాయకులు శ్రీపతి రాము, అశోక్, వెంకీ, హేమచంద్ర యాదవ్, ప్రశాంత్ గౌడ్, చిన్నరాజ, ప్రసన్న, శంకర్ మౌనేష్ తదితరులు పాల్గొన్నారు.