సజ్జాపురంలో జనసేనలో చేరికలు

తణుకు నియోజకవర్గం, తణుకు పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో సజ్జాపురం 28వ వార్డులో సుమారుగా 50 మందిని జనసేన పార్టీలోకి రామచంద్రరావు కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలొ నుతనంగా చేరినవారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో జాయిన్ అయ్యామని అని చెప్పారు. ఈ కార్యక్రమంలో తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు టౌన్ యూత్ ప్రెసిడెంట్ తులసీరామ్, తణుకు టౌన్ అధికార ప్రతినిధి పంతం నానాజీ, జనసేన నాయకులు జవ్వాది ప్రసాదు, సుంకర ప్రసాదు, కామవరపు రూప, కొక్కిరమిట్టి సత్తిబాబు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.