చెన్నూరు జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘననివాళి

మంచిర్యాల జిల్లా చెన్నూరు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మార్కెట్ లోని అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు మాయ రమేష్, పిట్టల సుధాకర్ లు ఆ మహనీయునికి నివాళులు అర్పించి, పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్, సాయి, శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.