సత్తెనపల్లిలో జనసేన నిరసన దీక్ష

సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ కుడి కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని సత్తెనపల్లిలో నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శాంతియుతంగా నిరాహారదీక్ష చేస్తున్నాం. పోలీసులను అడ్డుపెట్టుకుని దీక్షను అడ్డుకోవడం సరికాదు. రెండు రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు ఇంటి ముట్టడిస్తాం. అంబటిని నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా చూస్తాం. అంబటికి నోరేసుకుని వాగటం తప్ప ఏమి చేతకాదు. నీ అక్రమ సంపాదన తప్ప రైతుల గురించి ఆలోచన లేదు. రాష్ట్రంలో అందరూ చేతగాని మంత్రులే, పరిపాలన ఎలా చేయాలో తెలియదు. ఇసుకను ఎలా దోచుకోవాలో, కొండలను ఎలా త్రవ్వు కోవాలో ఆలోచన తప్ప ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదు. జనసేన ప్రజల పక్షం. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తాంమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఎర్రంశెట్టి రామకృష్ణ, తిరుమల శెట్టి సాంబశివరావు, తిరుమల శెట్టి మల్లేశ్వరి, రాడ్లు శ్రీనివాసరావు, దమ్మాలపాడు ఎంపీటీసీ రామారావు, సిరిగిరి మణికంఠ, రాజ్యలక్ష్మి, గ్రంధి సదాశివరావు, రుద్రారం గ్రామ అధ్యక్షులు సుబ్బారావు, పోతంశెట్టి శ్రీనివాసరావు, ఐలం ఆదినారాయణ, మరియు సత్తనపల్లి పెద్దకూరపాడు తాడికొండ నరసరావుపేట నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.