వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లకు సన్మానం

దర్శి నియోజకవర్గంలోని, దర్శి పట్టణంలో జరిగినటువంటి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లను గురువారం ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మరియు జనసేన పార్టీ రాష్ట్ర యువ నాయకులు దాసరి కిరణ్ లు పాల్గొని దర్శి నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వాలు చేసిన వాలంటీర్లను మెమొంటోలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి రాయపాటి అరుణ మరియు దాసరి కిరణ్ మాట్లాడుతూ రాబోయే రోజులలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రతి ఇంటికి పవన్ కళ్యాణ్ జనసేన మేనిఫెస్టో సిద్ధాంతాలను తెలియజేయాలని సూచిస్తూ యువత అందరూ రాబోయే రోజులలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం వరికూటి నాగరాజు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలో రెండవ స్థానంలో నిలిచిన దర్శి నియోజకవర్గంలో సభ్యత్వాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ రాబోయే రోజులలో జనసేన పార్టీని అధికారంలోకి వస్తుందని, దర్శి నియోజకవర్గంలో ఎప్పుడు, ఏ సమయంలో అయినా నా అవసరం ఉంటే జనసైనికులకు నిత్యం అందుబాటులో ఉంటాను అని, నా ఈ చివరి శ్వాస వరకు జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తానని దర్శి నియోజకవర్గ జనసైనికులు మరియు అతిధుల ముందు వారు తెలియజేయడం జరిగినది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వరికూటి నాగరాజు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.