రంజాన్ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణం నందు అతి పురాతనమైన పేరుగాంచిన కాకినాడ రోడ్లో గల మసీదు నందు పిఠాపురం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్ రంజాన్ కార్యక్రమంలో పాలుపంచుకుని ముస్లిం సోదరులకు స్వీట్స్ అందించడం జరిగింది. ముస్లిం సమాజానికి అతి ముఖ్యమైన రంజాన్ పండుగ, ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఇస్లాం సోదర సోదరీమణులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముస్లిం సోదరులతో కలిసి పండుగ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. అనంతరం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వం హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేక మతాలవారు ఉన్నా కూడా అందరూ కలిసి ఒక అన్న తమ్ముళ్లలాగా అక్క చెల్లెలగా కలిసి ఉండే ఏకైక దేశం మన భారతదేశం అట్లాంటి భారతదేశంలో పుట్టినందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము నా చిన్నతనం నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా ఎక్కువగా ముస్లిం సోదరులతోనే స్నేహ సంబంధాలు ఉండేవి అదే బంధంతో ఈరోజు నేను ఇక్కడ ఈ ముస్లిం సోదరులతో కలిసి పాలుపంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని, ఈ ఆకాశం కల్పించిన అల్లాకు నాతోటి ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అతిపవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో క్రమ శిక్షణ, దాతృత్వం, సోదర భావాన్ని పెంపొందించి, మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ ఇస్లాం సోదర, సోదరీమణులందరికీ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.