యూఏఈ జనసేన – గల్ఫ్ సేన జనసేన ఆత్మీయసమావేశం

యూఏఈ జనసేన – గల్ఫ్ సేన జనసేన, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ కొణిదెల నాగబాబు యూఏఈ పర్యటన నిమిత్తం మే నెలలో వస్తున్నందున నిర్వహించనున్న కార్యక్రమాలు మరియు పార్టీ బలోపేతం పర్యటనలో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని ఫుజారాలో గల యూఏఈ జనసేన గల్ఫ్ సేన జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన యూఏఈ జనసేన కార్యకర్తల సమావేశం యూఏఈ జనసేన నాయకులు పెనుమాల జాన్ బాబు, కేసరి త్రిమూర్తులు, మొగళ్ళ చంద్రశేఖర్, సత్య, వీర ప్రసాద్ రావు, ఉదయ్, మరియు పలువురు జనసైనికులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కొంతమంది పుజారా యూఏఈ జనసేన గల్ఫ్ సేన జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది.