ఎక్కువూరు గ్రామంలో జనసేన ఉచిత మెగా వైద్య శిబిరం

ఇచ్చాపురం, ఉప్పలం పంచాయతీ – ఎక్కువూరు గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జేమ్స్ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథులు జనసేన పార్టీ – ఇచ్ఛాపురం నియోజకవర్గం జనసేన నాయకులు, జనసేన ఇచ్చాపురం సమన్వయకర్త దాసరి రాజు, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధనరెడ్డి, జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ మరియు జనసేన పార్టీ సర్పంచ్ – ఇసకల పాలెం బైపల్లి ఈశ్వరరావు, మత్స్యశాఖ కార్యదర్శి నాగుల హరి బెహరా, ఇచ్చాపురం నియోజకవర్గం జనసైనికులు మరియు ఎక్కువూరు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. సుమారు 120 మందికి వైద్య పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రొకళ్ళ భాస్కర్, సంతోష్, మహారాణ దేవాకర్, రాజు, శంకర్, రవి, మధు, రామకృష్ణ, ప్రేమ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.