మిస్టర్ -Cతో క్వారంటైన్ లో ఉపాసన

మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు కరోనా కారణంగా టెన్షన్ లో ఉన్నారు.. మంగళవారం ఉదయం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా సోకినా విషయాన్నీ తెలిపి షాక్ ఇవ్వగా..సాయంత్రం మరో మెగా హీరో వరుణ్ తేజ్ కరోనా బారిన పడినట్లు తెలిపి ఇంకాస్త టెన్షన్లో పడేసారు. ప్రస్తుతం వీరు మాత్రమేనా.. ఇంకొంతమంది కరోనా బారినపడతారా అని అంత భయపడుతున్నారు.

రామ్ చరణ్ కి అసలు వైరస్ లక్షణం కనిపించలేదు. ప్రస్తుతానికి ఇంట్లోనే నిర్బంధంలో ఉన్నారు. చరణ్ తో కలిసి ఉపాసన సైతం క్వారంటైన్ లో ఉన్నారు. రామ్ చరణ్‌కు కరోనా వైరస్ సోకడంపై ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ సంవత్సరం కూడా వెళ్లిపోతోంది. 2021 అయినా బాగుండాలని ఆశిస్తున్నాను. ఎలాంటి లక్షణాలు లేవు.. ఆయన చాలా బలంగా ఉన్నారు. నాకు నెగిటివ్ వచ్చింది. కానీ, నాకు కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం నేను మిస్టర్ సి (చరణ్‌ను ముద్దుగా ఇలా పిలుస్తారు)తో హోం క్వారంటైన్‌లో ఉన్నాను. వేడి ద్రావణాలు తీసుకుంటున్నాం. ఆవిరి పడుతున్నాం. విశ్రాంతి తీసుకుంటున్నాం’’ అని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.  మొత్తానికి చెర్రీని కలిసిన వారంతా జాగ్రత్తలతో ఉన్నారని అర్థమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *