టీమ్ సైనిక మరియు యూఏఈ జనసేన ఆధ్వర్యంలో కేలండర్ల ఆవిష్కరణ

  • వారాహి సమేత కళ్యాణ్, జనసేన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, సేవలు, ధాతృత్వాలు గల కేలండర్ల ఆవిష్కరణ

బొబ్బిలి నియోజకవర్గం, జనసేన నాయకులు రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు చేతులు మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీమ్ సైనిక ఫౌండర్ అమీర్ ఖాన్ మరియు జనసేన పార్టీ యుఏఈ జనసేన టీం లీడర్ అప్పారావులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్యకర్తలకు క్యాలెండర్లు అందచేసేందుకు సహకరించిన టీం సైనిక & యుఏఈ జనసేన టీం సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, తెర్లం మండల అధ్యక్షులు మాదన రవి, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి అల్లు రమేష్ మరియు జనసైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.