నయన్ ని వరించిన మరో విభిన్న పాత్ర

సౌత్ ఇండియాలో మోస్ట్ సెన్సేషన్ స్టార్ గా, విమెన్ సూపర్ స్టార్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి నయనతార. లేడీ ఒరియాంటెడ్ సినిమాలకి కేరాఫ్ గా మారిన నయనతారకి కోలీవుడ్ లో వరుసగా అవకాశాలువస్తున్నాయి. కెరియర్ లో విభిన్న పాత్రలు చేస్తూ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా నయనతార కొనసాగుతుంది. ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భీభత్సంగా ఉండటంతో నయనతార సినిమా అంటే భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి.ఈ ఏడాది అమ్మోరుతల్లి సినిమాతో నయనతార ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

తాజాగా నయన్  టాలెంటెడ్ దర్శకుడు సుశి గణేశన్ దర్శకత్వంలో ఓ బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కే సినిమా కావడం ఇప్పుడు కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై నయనతారతో సుశిగణేశన్ చర్చలు జరిపాడని, ఆమె నటించడానికి ఒకే చెప్పేసిందని సమాచారం.

బ్రిటిష్‌వారిపై పోరాడిన మొట్టమొదటి మహారాణిగా గుర్తింపు తెచ్చుకున్న రాణి వేలు నాచ్చియార్ పాత్రలో నయనతార కనిపించబోతుంది. ఝాన్సీరాణి చేసిన సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్ర్య ఉద్యమంగా గుర్తింపు తెచ్చుకున్న అంతకంటే ముందుగానే సౌత్ ఇండియాలో చాలా మంది రాజులు, రాణులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తమ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేశారు. అయితే కొంత మంది స్వార్థపరుల కారణంగా బ్రిటిష్ వారు అన్ని సంస్థానాలని తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు.తమిళనాడులోని రామనాథపురానికి చెందిన రాణి నాచ్చియార్.1780 నుంచి 1790 వరకూ శివగంగై సంస్థానాన్ని పాలించారు.పోరాటస్ఫూర్తికి నిదర్శనంగా ఆమె జీవితం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *