పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్యకు నివాళులర్పించిన బొర్రా

సత్తెనపల్లి, స్వర్గీయ వావిలాల గోపాలకృష్ణయ్య 20 వ వర్ధంతిని సత్తెనపల్లి జనసేనపార్టీ నాయుకులు బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పలుచోట్ల స్వర్గీయులు వావిలాల గోపాలకృష్ణయ్య చిత్రపటాలకు, అలాగే విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘననివాళులు అర్పించడం జరిగినది. అనంతరం బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ వావిలాల స్వాతంత్ర్య సమరయోధులుగా, సత్తెనపల్లి నుండి నాలుగుసార్లు ఎన్నికైన శాసనసభ్యునిగా, మద్యపాన నిషేధ మహోద్యమాన్ని నడిపిన నేతగా అందరికీ తెలుసుననీ, కానీ నేటితరంలో చాలా మందికి తెలియని ముఖ్యమైన విషయాలు మరికొన్ని ఉన్నాయని అన్నారు. గ్రంథాలయోద్యమం చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి గ్రంథాలయాన్ని సత్తెనపల్లిలో నెలకొల్పడం, సహకారోద్యమానికి నాయకత్వం వహించడం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బహుళార్థసాధక ప్రాజెక్ట్ నాగార్జునసాగర్ నిర్మాణంకు కృషి చేయడం, తెలుగు అధికార బాషా సంఘంను స్థాపించి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే వచ్చేలా చేయడం, తెలుగు సాహిత్యసేవ చేయడంతో పాటు స్వయంగా రచనలు చేయడం, తెలుగులో టైప్ రైటర్ ను తయారు చేయించడం, పుల్లరి ఉద్యమంలో జైలు జీవితం వంటివి వావిలాల జీవితంలో మరికొన్ని ముఖ్యఘట్టాలు అని ఆయన అన్నారు. వారి సేవలకు గుర్తింపుగా వారు కళాప్రపూర్ణ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించబడ్డరాని ఆయన కొనియాడారు. అనంతరం జనసైనికులు, వీరమహిళలు అందరూ కలసి పట్టణంలోని వావిలాల ఘాట్ ను సందర్శించి మన్నవ షోడేకర్ ఆధ్వర్యంలో వావిలాల విగ్రహానికి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించారు. అనంతరం డొక్కా సీతమ్మ ఉచిత మంచినీటి చదివేంద్రాలు సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు చేతుల మీదగా ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మండల అధ్యక్షులు కౌన్సిలర్ మండల కమిటీ సభ్యులు గ్రామ అధ్యక్షులు, జనసైనికులు వీర మహిళలు పాల్గొనడం జరిగినది.